Thursday, July 16, 2026
E-PAPER
Homeఆటలుసరికొత్తగా వన్డే వరల్డ్‌కప్‌

సరికొత్తగా వన్డే వరల్డ్‌కప్‌

- Advertisement -

కొత్తగా సూపర్‌ సిరీస్‌, సూపర్‌ సెవన్‌ అంచెలు
2027 ప్రపంచకప్‌ నుంచే ఈ ఫార్ములా అమలు


లండన్ (ఇంగ్లాండ్‌)
: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో సరికొత్త ప్రయోగాలు రానున్నాయి. 10 జట్లతో కూడిన వన్డే ప్రపంచకప్‌లో ఇక నుంచి 14 జట్లు పోటీపడనుండగా.. ఫైనల్‌కు చేరుకునేందుకు పోటీ అంచెలు పెరిగాయి. కొత్తగా సూపర్‌ సిరీస్‌, సూపర్‌ సెవెన్‌ దశలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం 12, 13, 14వ స్థానల్లో నిలిచిన జట్లు తొలుత సూపర్‌ సిరీస్‌లో పోటీపడతాయి. అగ్రస్థానంలో నిలిచిన జట్టు తర్వాతి రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. రెండో అంచెలో 12 జట్లు ఆరేసి జట్లుగా గ్రూప్‌లుగా ఆడతాయి. గ్రూప్‌ దశలో టాప్‌-3లో నిలిచిన జట్లు ముందంజ వేస్తాయి. రెండు గ్రూప్‌ల్లో మెరుగైన నాల్గో స్థానంలో నిలిచిన జట్టు సైతం ముందంజ వేస్తుంది. ఈ ఏడు జట్లు సూపర్‌ సెవెన్‌లో రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో తలపడతాయి. సూపర్‌ సెవెన్‌లో టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకోనున్నాయి. ఇటీవల జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొత్త రూల్స్‌, అంచెలు ప్రపంచకప్‌ను ఓ ప్రహాసనంగా మార్చివేస్తాయా? లేదంటే విజేతను తేల్చేందుకు అభిమానులకు మరింత కిక్‌ అందిస్తుందా? వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -