Saturday, May 30, 2026
E-PAPER
Homeసోపతిదిగులు పద్యం!

దిగులు పద్యం!

- Advertisement -

రోజు ఎన్నిసార్లు ఉదయించినా
దిగులు మేఘమొక్కటీ తొలగిపోవడం లేదు!
మంచి కాలాన్ని కలగనటానికి
ధైర్యం విలోలమవుతున్నది!
అంతటా ప్రజాస్వామ్యం ఓ మేలిముసుగేహొ
భూగోళమంతా నియంతత్వమే!
కన్నెత్తి చూడలేముహొ
పన్నెత్తి మాట్లాడలేము!
నువ్వూ నేనూ చేస్తున్న యుద్ధాలన్నీ
జానెడు పొట్ట పోసుకోవడానికే!
వాళ్ళెందుకు యుద్ధాలు చేస్తున్నారు?!
మనకెవరికీ అర్థం కాని ప్రశ్న!
కొట్టుక చస్తున్నది వాళ్లు కదాహొ
దుఖం మననెందుకు చుట్టుముడుతున్నది?
బడి ఆసుపత్రి విమానాశ్రయాలు కూల్చేసిహొ
విజయ ప్రకటనలా ఎంత అమానుషం?
సహజ సంపదలని సర్వనాశనం చేశాకహొ
భూమ్మీద మనిషినెవడైనా మొలిపిస్తాడా?
ఆధిపత్యాంహంకారం జడలు విప్పిన చోటహొహొ
ప్రళయాలకు ద్వారాలు తెరుచుకుంటాయి!
ఇక్కడే కాదు విశ్వవీధులన్నీ
చైతన్యాలను పాతిపెట్టినయి!
అంతులేని రాజకీయ లాలసత్వంహొ
మనిషికిహొ సమాధులు తవ్వుతున్నది!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి,
94402 33261

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -