Sunday, September 20, 2026
E-PAPER
Homeకవితఆకుపచ్చనిపొద్దులో చిగురింత

ఆకుపచ్చనిపొద్దులో చిగురింత

- Advertisement -


ఎక్కడో శీతాకాలం చిగురింత ఆపింది.
ఇక్కడే వేసవి మంచుపల్లకిలో రానుంది.
కురుస్తున్న వానలో చినుకుల తడిలేకపోయింది.
ధాన్యరాశిలో ధగధగల వెండికంచాలున్నాయి. మునుపెన్నడూ లేనంతగా అమాంతం చెట్లు పచ్చివాసనలు కోల్పోయాయి.
ప్రకృతిసంపద సన్నగిల్లి ఎండిపోయింది.
కటువుగా గాలివీస్తుంటే, శ్వాసకి
విషవాయువులు ఎక్కువైపోయాయి.
నిజం చెప్పాలంటే
వనం ఓ దైవం అప్పట్లో.
వనం ఇంటి సంపదైపోయింది ఇప్పట్లో.
కొమ్మల్లో కోయిల కూతలాగి
ఎండు ఆకులతో గూళ్లు కట్టుకుంటే…
పిట్టలు ఆకలి తీర్చలేక, గానకూతలు పెట్టలేక, చల్లగాలిలో తిరగలేక అడవి సంచారిలో విలవిలలైపోతున్నాయి.
కలుషిత ఆవరణంలో ఉండలేక,
మంచుకురిసే వానలో ఉప్పుగాలి
వాసనని పీల్చుకుంటూ,
ఉడికించే వేడిలో జీవిస్తుంటే
ఆకుపచ్చని పొద్దులేక
అలమటించే ప్రకృతిని చూస్తూ ఉండిపోతున్నా.
నియంత్రణలేని, నిబంధనలేని సమాజంలో
సాంద్రత అంతా సంపదలో మునిగిపోతుంటే …
ఆకుపచ్చని పొద్దులో ప్రతిపొద్దు వస్తోందిలా.
మడూరి అనిత, 9494579069

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -