- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ (బీఏఏ) పూర్తి చేయని కుటుంబాలకు అక్టోబర్ 1 నుంచి 14.2 కేజీల గృహ ఎల్పీజీ సిలిండర్‌పై సబ్సిడీ నిలిపివేయబడనుంది. బీఏఏ పూర్తి చేసే వరకు సబ్సిడీపై రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. అయితే, కనెక్షన్ రద్దు లేదా గ్యాస్ నిలిపివేత ఉండదు. అవసరమైతే, 5 లేదా 10 కేజీల సిలిండర్లను మార్కెట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. బీఏఏ పూర్తి చేసిన వెంటనే సబ్సిడీ రీఫిల్ సౌకర్యం పునరుద్ధరిస్తారు. తెలంగాణలో 88 శాతం మంది బీఏఏ పూర్తి చేశారు.
- Advertisement -



