Thursday, June 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమరో మల్టీస్టారర్ మొదలైంది

మరో మల్టీస్టారర్ మొదలైంది

- Advertisement -

కథానాయకులు వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ ఒక పూర్తి స్థాయి పండగ వినోదాత్మక చిత్రం అందించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రం 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర బృందం, పలువురు ప్రముఖ అతిథుల సమక్షంలో ఘనంగా జరిగిన ముహూర్తం, పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది.
దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటికి అధికారికంగా అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ముహూర్తం సందర్భంగా వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టిలపై చిత్రీకరించిన మొదటి షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేష్ బాబు కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ఓపెనింగ్ షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అనిల్ రావిపూడి స్టయిల్ లో సాగే వినోదం, నవ్వులతో కూడిన సంక్రాంతి చిత్రంగా ఉండబోతోంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబో ఈ ప్రాజెక్ట్‌కు మరింత ఎట్రాక్షన్ జోడించడంతో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగ చిత్రాలలో ఒకటిగా ఇది నిలుస్తోంది. అనిల్ రావిపూడికి ఉన్న అద్భుతమైన బ్లాక్‌బస్టర్ ట్రాక్ రికార్డ్, స్టార్స్ కలయిక, పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల మద్దతు కారణంగా ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అని మేకర్స్ తెలిపారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి, నిర్మాత: సాహు గారపాటి, సమర్పకులు: సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన, సంగీతం: జివి ప్రకాష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ, సినిమాటోగ్రాఫర్: సమీర్ రెడ్డి, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -