Sunday, September 20, 2026
E-PAPER
HomeఆటలుAsian Games: పాక్ పై శ్రీలంక ఘన విజయం

Asian Games: పాక్ పై శ్రీలంక ఘన విజయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏషియన్ గేమ్స్‌లో శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకుపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ దులానీ 27 పరుగులు చేయగా, కెప్టెన్ చమరి ఆటపట్టు 83*(50 బంతుల్లో) రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇందులో 6 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. రెండో సెమీఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -