కావలసిన వస్తువులు : బెలూన్లు, వెడల్పైన చెక్క.
ప్రయోగం చేయు విధానం : ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులారా! నాలుగు బెలూన్లను తీసుకొని సమానంగా గాలిని ఊది ఫోటోలో చూపిన విధంగా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న బెలూన్ల మీద వెడల్పైన చెక్కను అమర్చుకోవాలి. అమర్చుకున్న తర్వాత చెక్క మీద మీరు కూర్చొని గమనించండి.
ప్రయోగ వివరణ : విద్యార్థులారా! మీరు ఒక్క బెలూన్ మీద చెక్కను వేసి కూర్చున్నచో బెలూన్ మీ బరువు వలన పగిలిపోతుంది. నాలుగు బెలూన్లను ఉపయోగించి చెక్కను వేసి కూర్చున్నచో ఆ బెలూన్లు పగిలిపోవు. ఒక్క బెలూన్ వాడినప్పుడు మీ బరువు వలన ఎక్కువ పీడనం దానిపై పడి బెలూన్ పగిలిపోతుంది. అంతే బరువు ఉన్న మనం నాలుగు బెలూన్ల మీద కూర్చున్నప్పుడు బెలూన్ల మీద తక్కువ పీడనం పడి పగిలిపోవు.
సమానమైన బరువు (బలం) తక్కువ వైశాల్యం, ఎక్కువ వైశాల్యం ఉన్న స్థలంపై పడినచో, తక్కువ వైశాల్యం ఉన్న స్థలంపై ఎక్కువ పీడనం ఉండి, ఎక్కువ వైశాల్యం ఉన్న స్థలంపై తక్కువ పీడనం ఉంటుంది. ఇక్కడ నాలుగు బెలూన్లకు ఎక్కువ వైశాల్యం ఉండడం వలన అంతే బరువు ఉన్న మనిషి ద్వారా తక్కువ పీడనం పడుతుంది. కావున బెలూన్లు పగిలిపోవు.
వాస్తవ జీవిత ఉదాహరణలు : బమనం కూరగాయలను, పండ్లను షార్ప్‌గా ఉన్న కత్తితో సులభంగా కోయగలం. షార్ప్‌గా ఉన్న కత్తి కోసేటప్పుడు తక్కువ వైశాల్యాన్ని ఆక్రమించి ఎక్కువ పీడనాన్ని కలిగిస్తుంది. బ పిల్లల స్కూల్ బ్యాగ్ పట్టీలు వెడల్పుగా ఉండడం వలన భుజాల మీద తక్కువ పీడనం పడుతుంది. భారీ వాహనాల టైర్లు వెడల్పుగా ఉండడం వలన వాహనం మట్టిలో కూరుకుపోకుండా కాపాడుతాయి వాలుగొండ వెంకటేశ్వర్లు,
సైన్స్ పాపులరైజర్, 9640053470
బెలూన్ బెంచ్ ప్రయోగం
- Advertisement -
- Advertisement -



