శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా నటిస్తున్న సినిమా ‘సర్కారు బాయి`. డెక్కన్ ఫిలింస్ సమర్పణలో తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు లారా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్పటి తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబిస్తూ నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటం వంటి అంశాలను తెరకెక్కిస్తున్నారు.
హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ మూవీ టీమ్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తెలంగాణ పల్లె యువకుడిగా ఎంతో సహజంగా శ్రీరామ్ నిమ్మల కనిపిస్తున్నారు. ఆ సినిమా హీరోగా, నటుడిగా ఆయనకు మంచి పేరు తెస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తు తం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటోంది. చేగుంట సమీపంలోని రెడ్డిపల్లి అనే ఊరిలో చిత్రీకరణ జరుపుతున్నారు. నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తు న్నారు. హీరో శ్రీరామ్ నిమ్మల, హీరోయిన్ వర్షిక, ముఖ్య నటీనటులు బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్ లపై సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. జూలై నెలాఖరు వరకు ఈ భారీ షెడ్యూల్ కొనసాగ నుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.
వాస్తవ ఘటనల ఆధారంగా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



