Friday, September 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -


అవార్డులు ప్రోత్సాహానిస్తాయి:
ఎస్‌‌సీఆర్‌ మేనేజర్ సంజయ్‌‌కుమార్‌ శ్రీవాస్తవ
నవతెలంగాణ -హైదరాబాద్‌

సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సోమవారం నిర్వహించిన సమగ్ర సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే రైళ్ల నిర్వహణలో భద్రత పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ప్రమాద పరిస్థితులను నివారించడంలో కనబరిచిన అంకితభావం, అప్రమత్తతకు గుర్తింపుగా పద్నాలుగు మంది ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ‘ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్’ భద్రతా అవార్డులను అందజేశారు. ఈ సమావేశంలో ఎస్‌‌సీఆర్‌ అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్‌తో పాటు అన్ని విభాగాల ప్రధాన అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విధుల పట్ల అప్రమత్తత, సమయపాలన, పరిపూర్ణత అంకితభావాన్ని అభినందిస్తూ ట్రాక్ మెయింటెనర్లు, పాయింట్స్ మ్యాన్, టెక్నీషియన్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు లోకో పైలట్లతో కూడిన ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఈ అవార్డులను అందజేశారు. సికింద్రాబాద్ డివిజన్‌‌లో ఒకరు, విజయవాడ డివిజన్ లో ఇద్దరు, గుంటూరు డివిజన్ లో ఇద్దరు, హైదరాబాద్ డివిజన్ లో ముగ్గురు, నాందేడ్ డివిజన్‌‌లో ఒకటి, గుంతకల్ డివిజన్ లో ఐదుగురు అవార్డు గ్రహీతలను అభినందిస్తూ జనరల్ మేనేజర్ విధుల నిర్వహణలో వారి అంకితభావాన్ని చిత్తశుద్ధిని ప్రశంసించారు. ఇటువంటి గుర్తింపు ఇతర ఉద్యోగులను కూడా అప్రమత్తంగా ఉండటానికి, రైలు కార్యకలాపాలలో భద్రతా ప్రమాణాలను కాపాడటానికి ప్రొత్సహిస్తున్నదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -