Wednesday, September 23, 2026
E-PAPER
Homeజాతీయంసూపర్‌ ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

సూపర్‌ ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

- Advertisement -

పర్యావరణ శాస్త్రవేత్తల పిలుపు
బెంగళూరు : సూపర్‌ ఎల్‌నినో కారణంగా వన్యప్రాణులపై, పర్యావరణ వ్యవస్థలపై పడే తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సుమారు 200 మంది పర్యావరణ శాస్త్రవేత్తలు తమ తోటి పరిశోధకులు, క్షేత్ర స్థాయి నిపుణులను కోరారు. ఎల్‌నినో ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, దానిని అంచనా వేయడానికి పరిశోధన-పర్యవేక్షణ యత్నాలను ముమ్మరం చేయాలని సూచించారు. భారత్‌ సహా ప్రపంచంలోని పలు దేశాలపై ఎల్‌నినో ప్రభావం ఇప్పటికే ప్రారంభమైంది. ఇది చాలా తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించాయి. మానవ చరిత్రలోనే ఇది అత్యంత వేడిగా ఉండే సంవత్సరాలలో ఒకటిగా నిలుస్తుందని వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్‌ చెప్పారు. ఓ బలమైన ఎల్‌నినో ఏర్పడుతుందని, అది ఆగస్ట్‌-అక్టోబర్‌ మధ్య మరింత బలపడుతుందని ఐరాసకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) జూలైలోనే తెలియజేసింది. ఈ నెల 3న అది స్థిరంగా ఏర్పడిందని తాజాగా ప్రకటించింది. రాబోయే కాలంలో ఇది మరింత బలమైన స్థాయికి చేరుకొని వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ కొనసాగుతుందని తెలిపింది. దీనివల్ల వర్షపాతం, ఉష్ణోగ్రతలపై తీవ్ర ప్రభావం పడుతుందని, అలాగే కొన్ని ప్రాంతాలలో వరదలు, కొన్ని ప్రాంతాలలో కరువు కాటకాలు సంభబిస్తాయని చెప్పింది. ఎల్‌నినో మన కళ్ల ముందే విశ్వరూపం చూపిస్తోందని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్‌పై తీవ్ర ప్రభావం
రాబోయే నెలలలో సూపర్‌ ఎల్‌నినో మన దేశంపై అనేక రకాల వినాశకరమైన ప్రభావాలను చూపిస్తుందని 188 మంది భారతీయ పర్యావరణవేత్తలు ఈ నెల 16న ‘కాల్‌ టు యాక్షన్‌’ పేరిట ఓ ప్రకటనలో హెచ్చరించారు. వన్యప్రాణుల రక్షణకు, పర్యావరణ వ్యవస్థల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -