నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గల బీడీ కార్మికులు బుధవారం నాడు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి దంపతులను కలిసి శాలువలతో ఘనంగా సత్కరించారు స్వీట్ లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీడీ కార్మికులు సర్పంచ్కు విజ్ఞప్తి చేస్తూ ఏండ్ల తరబడి ఇండ్లు లేక అధ్యభవనాల్లో జీవనం గడుపుతున్నామని తమకు ఇండ్ల స్థలాలు ఇండ్లు మంజూరు చేయించి నిర్మింప చేయాలని సర్పంచ్ దంపతులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీడీ కార్మికులకు సర్పంచ్ దంపతులు హామీ ఇస్తూ ఇండ్లు లేని నిరుపేదలకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇండ్ల మంజూరు చేయడం జరుగుతుందని వాటిలో భాగంగా అర్హులైన ప్రతి బీడీ కార్మికురాలిని ఇండ్ల స్థలం గాని ఇండ్ల మంజూరు గాని చేయిస్తానని తెలిపారు. సర్పంచ్ బీడీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇండ్ల మంజూరు గురించి తెలియజేయడం కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
సర్పంచ్ దంపతులకు బీడీ కార్మికులు సన్మానం స్వీట్ల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



