Friday, April 17, 2026
E-PAPER
Homeజాతీయండీలిమిటేష‌న్‌లో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు పెద్ద అన్యాయం:సీఎం ఎంకే స్టాలిన్

డీలిమిటేష‌న్‌లో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు పెద్ద అన్యాయం:సీఎం ఎంకే స్టాలిన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: డీలిమిటేష‌న్‌ అంశంపై మ‌రోసారి త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ మోడీ స‌ర్కార్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. భార‌త్ అభివృద్దికి త‌మిళ‌నాడుతో పాటు ద‌క్షిణ రాష్ట్రాలు దోహ‌దం చేశాయ‌ని, అందుకు కేంద్రం ద‌క్షిణాది రాష్ట్రాల‌ను శిక్షిస్తుంద‌ని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా ఆరోపించారు. ఇది చ‌రిత్ర‌లో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు కేంద్రం చేసిన పెద్ద త‌ప్పుగా, అన్యాయంగా లిఖించ‌బ‌డుతుంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. మోడీ నిర్ణ‌యాల‌తో ద‌క్షిణాది రాష్ట్రాలు ఆగ్ర‌హాంతో ఉన్నాయ‌ని, బీజేపీ నిప్పుతో ఆడుకుంటుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

రేపు తమిళనాడు వ్యాప్తంగా ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నల్లజెండాలు ఎగురవేయాలని, నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు తెలియ‌జేయాల‌ని డిఎంకె అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. మోడీ ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యాల‌ను వెన‌క్కి తీసుకోక‌పోతే భ‌విష్య‌త్‌లో త‌గిన మూల్యం చెల్లించుకుంటుంద‌ని హెచ్చ‌రించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -