- Advertisement -
రైతు లేనిదే రాజ్యం లేదు
రైతు పడని కష్టం లేదు
రైతు చూడని నష్టం లేదు
రైతు బతుకులో నవ్వే లేదు
రైతు లేనిదే బతుకే లేదు
రైతు లేనిచో మెతుకే లేదు
రైతును రాజు అని పిలిచేస్తాం
అలాంటి రైతుకు విలువేలేదు
దేశానికి వెన్నెముక రైతు
దేశ ప్రగతికి మూలం రైతు
అందుకే జై కిసాన్ అన్నారు
కానీ ఏమున్నది లాభం
ప్రస్తుత రైతు పరిస్థితి మరీ దారుణం
అందరి కడుపులు నింపే
అన్నదాత నీకు వందనం
కొత్తగొల్ల మాళవిక, పదవ తరగతి ZPHS ఏఖీన్ పూర్ కోరుట్ల మండలం జగిత్యాల జిల్లా
- Advertisement -



