Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎద్దును చంపిన ఇద్దరిపై కేసు నమోదు

ఎద్దును చంపిన ఇద్దరిపై కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ : మండల కేంద్రంలోని శ్రీ లింగమయ్య ఆలయానికి సంబంధించిన ఎద్దు (బొండా) ను ఆదివారం ముప్కాల్ మండలం వేంపల్లికి చెందిన తోట శ్రీనివాస్, తేలు నర్సయ్య లు ఆదివారం చంపారని వీరు చోరీకి ప్రయత్నం చేస్తుండగా అనుమానస్పదంగా ఎద్దు మృతి చెందిందని బాల్కొండ ఎస్ ఐ శైలేందర్ తెలిపారు. శివాజీ చౌక్ సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్ వెనకాల ఇండ్ల సమీపంలో ఎద్దు (బోండా) ఉండగా పైన తెలిపిన నిందితులు ఇద్దరు బోండాను అపహరించడానికి ప్రయత్నించారని చెప్పారు. ఈ క్రమంలో ఎద్దు మెడకు తాడును కట్టి లాగాగా , తాడు ఎద్దు మెడకు ఉరిలాగా పడి అక్కడికక్కడే మృతి చెంది ఉంటున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. చనిపోయిన ఎద్దు బోండాను ఊరు శివారులోకి తీసుకెళ్లి వెటర్నరీ డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించి, పూడ్చి పెట్టినట్లు ఎస్ ఐ తెలిపారు.పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులిద్దరిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. బాల్కొండ గ్రామానికి చెందిన కడ్తాల పెద్ద రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శైలేందర్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -