– అమల్లోకి పదిరోజుల కాల్పుల విరమణ
అయినా దాడులు ఆపని ఇజ్రాయిల్
యుద్ధాలతో తీవ్ర అనిశ్చితి నెలకొన్న మధ్యప్రాచ్యంలో పరిస్థితులు కొంత మెరుగవుతున్నాయి. ఇప్పటికే అమెరికా-ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ జరగగా.. అది ఇప్పుడు ఇజ్రా యిల్-లెబనాన్‌లో మధ్య కూడా చోటు చేసుకుంది. ఈ రెండు దేశాల మధ్య పది రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇది గురువారం నుంచి అమల్లోకి రానుందని అమెరికా అధ్యక్షు డు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం
శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి రానుంది. కాగా దశాబ్దాల తర్వాత తొలిసారిగా అమెరికా వేదికగా ఇజ్రాయిల్, లెబనాన్ జరిపిన చర్చలు ఫలించాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్య మం ‘ట్రూత్ సోషల్’లో ప్రకటించారు. హిజ్బుల్లా పేరు చెప్పుకొని ఇప్పటి వరకు లెబనాన్‌పై దాడులకు తెగబడింది ఇజ్రా యిల్. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొ న్నారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందంతో లెబనాన్‌లో ప్రజలు సంబరాలు జరుపు కున్నారు. అయితే ఒప్పందం ప్రకటన వెలువ డిన తర్వాత కూడా ఇజ్రాయిల్ దాడులు మాత్రం ఆగలేదు. లెబనాన్‌లో పలు ప్రాంతాలపై దాడులు జరిపినట్టు తెలిసింది.
ఇజ్రాయిల్-లెబనాన్ మధ్య సీజ్ఫైర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



