- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ :అయోధ్య రామమందిరం లో భక్తుల విరాళాల చోరీ నేపథ్యంలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (Ram JanmaBhumi TheerthaKshetra Trust) ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన రాజీనామాను ట్రస్ట్ సోమవారం ఆమోదించింది. ఆయన స్థానంలో బజరంగ్ లాల్ బగ్రా (Bajrang Lal Bagra) కు బాధ్యతలు అప్పగించినట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఆయన డ్రైవర్ రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్నూతోపాటు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. అయితే ఇప్పటివరకు చంపత్‌రాయ్ లేదా అనిల్ మిశ్రాపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదు.
- Advertisement -



