- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించినే నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో సీఎం రేవంత్, ఎమ్మెల్యే తోట చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఈ పాలాభిషేకం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శివాజీ పటేల్, శశాంక్ పటేల్, ఉమాకాంత్ పటేల్, పురుషోత్తం పటేల్, నగేష్ పటేల్, సంగ్రామ్ పటేల్, విలాస్, శ్రీకాంత్, శ్రీధర్,నాగనాథ్, హన్మంత్ పటేల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -