మతం, కులం పేరిట ప్రజల్ని విభజిస్తున్న బీజేపీ:
సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండి అబ్బాస్
నవతెలంగాణ-నక్కలగుట్ట
సమాజంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, పేదరికం, దోపిడీ, వివక్షను నిర్మూలించి సమసమాజాన్ని స్థాపించేందుకు నిరంతరం వర్గ పోరాటాలు కొనసాగాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ అన్నారు. హనుమకొండ, దీన్‌దయాల్‌నగర్ ఉపాధ్యాయ భవన్‌లో మూడు రోజుల పాటు జరగనున్న హనుమకొండ జిల్లా రాజకీయ శిక్షణా తరగతులను శనివారం ఆయన ప్రారంభించారు. శిక్షణా తరగతులకు బొట్ల చక్రపాణి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతాల పేరుతో ప్రజలను విభజిస్తూ పాలన సాగిస్తోందని విమర్శించారు. నూతన ఆర్థిక విధానాల వల్ల దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగాయని, ప్రజల జీవన ప్రమాణాలు దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, రైతుల హక్కులకు భంగం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్, వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి. ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. చుక్కయ్య, రాగుల రమేష్, జిల్లా కమిటీ సభ్యులు టి. ఉప్పలయ్య, వి. వీరన్న, మంద సంపత్, దొగ్గల తిరుపతి, కాడబోయిన లింగయ్య, వేలు రజిత, ఎల్. దీపతో పాటు నాయకులు గుమ్మడిరాజుల రాములు, ఓరుగంటి సాంబయ్య, కారు ఉపేందర్, మంద మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
దోపిడీ రహిత సమాజం కోసం వర్గ పోరాటాలు అవసరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



