Friday, May 1, 2026
E-PAPER
Homeజాతీయంఅర్ధరాత్రి స్ట్రాంగ్‌రూమ్‌కు సీఎం మమత

అర్ధరాత్రి స్ట్రాంగ్‌రూమ్‌కు సీఎం మమత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈవీఎంల భద్రత విషయంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలకు తెగించి పోరాడతామని ఆమె స్పష్టం చేశారు. ఈవీఎంల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె స్వయంగా కోల్‌కతాలోని ఓ స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద మూడు గంటలకు పైగా ఉన్నారు. దక్షిణ కోల్‌కతాలోని సాఖావత్ మెమోరియల్ స్కూల్‌లో భవానీపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్‌రూమ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని, బ్యాలెట్ బాక్సులను తెరుస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియోలు టీవీలో చూసిన తర్వాత మమతా బెనర్జీ గురువారం రాత్రి నేరుగా అక్కడికి చేరుకున్నారు. భవానీపూర్ అభ్యర్థిగా తనకున్న హక్కుతో స్ట్రాంగ్‌రూమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ఈవీఎం యంత్రాన్ని దొంగిలించడానికి లేదా కౌంటింగ్‌ను తారుమారు చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే మేం ప్రాణాలకు తెగించి పోరాడతాం” అని హెచ్చరించారు. తనను మొదట సెంట్రల్ ఫోర్సెస్ సిబ్బంది అడ్డుకున్నారని, కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థిగా తనకు ఉన్న హక్కును వినియోగించుకుని లోపలికి వెళ్లానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -