ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’.
సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని జూన్ 19న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. సమంత మాట్లాడుతూ ,’ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. నందినీ, రాజ్ ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్‌గా ఉంటారు. ‘మా ఇంటి బంగారం’లో ప్రతీ ఎమోషన్ ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. యాక్షన్, డ్రామా, కామెడీ అన్ని అంశాలుంటాయి. జూన్ 19న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. అభిమానులంతా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు.
‘ఒకప్పటి సమంతకి ఇప్పటి సమంతకు ఎంతో తేడా ఉంది. ఇప్పుడు ఆమె నెక్ట్స్ లెవెల్లో ఉన్నారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఇలా ప్రతీ సీన్‌లో అదరగొట్టేశారు. నేను కూడా సమంత అభిమానిగానే మానిటర్ ముందు కూర్చుని చూశా. కచ్చితంగా ఈ సినిమా బ్లాస్ట్ అవుతుందిఅని దర్శకురాలు నందినీ రెడ్డి చెప్పారు. రాజ్ నిడిమోరు మాట్లాడుతూ,''మా ఇంటి బంగారం’ అనే పేరులోనే ఎంతో ఎఫెక్షన్, లవ్ ఉంటుంది. దాని వెనకాల డార్క్ సైడ్, పొసెసివ్ నెస్ కూడా ఉంటుంది అని తెలిపారు.
హిమాంక్ దువ్వూరు, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్
- Advertisement -
- Advertisement -



