Thursday, August 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉంది

 కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉంది

- Advertisement -

– ప్రభుత్వ సలహాదారు మహమ్మద్  షబ్బీర్ అలీ 
నవతెలంగాణ – కామారెడ్డి

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం జరిగిన బిసి డిక్లరేషన్ ధర్నాలో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్  షబ్బీర్ అలీ పాల్గోన్నారు. ఈ క్రమంలో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం, కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కు పంపించిది. బిజెపి మోసాన్ని దేశానికి తెలియజేసేందుకు  బిసి రిజర్వేషన్ను అమలు చేసేందుకు ఈ ధర్నా ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ఈ బీసీ రిజర్వేషన్ అనేది మతాలకు అనుగుణంగా కాకుండా మైనార్టీలో వెనుకబడిన వారికి మాత్రమే వర్తింప చేసే విధంగా ఉందని తెలిపారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కు పోరాడుతున్న నాయకులకు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ కి మల్లికార్జున కార్గే కు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -