Thursday, May 14, 2026
E-PAPER
Homeసినిమాఅందరికీ కనెక్ట్ అవుతుంది

అందరికీ కనెక్ట్ అవుతుంది

- Advertisement -

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా రూపొందిన సినిమా ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు హీరో ప్రియదర్శి, రాజు వెడ్స్‌ రాంబాయ్‌ చిత్ర దర్శకుడు సాయి కంపాటి హాజరయ్యారు. దర్శకులు సాయిలు కంపాటి మాట్లాడుతూ, ‘ టైటిల్‌ బాగుంది. 90వ దశకంలో పుట్టిన అందరికి కనెక్ట్‌ అవుతుంది` అని అన్నారు. ‘ఈ సినిమా ట్రైలర్‌ చూడగానే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో అందరికి ప్రపంచాన్ని పరిచయం చేసింది దూరదర్శని. నేను కూడా చిన్నప్ప్పుడు దూరదర్శన్లో సినిమాలు చూసి స్ఫూర్తి పొంది, నటుడిగా మారాను. ఈ దూరదర్శని సినిమా సమీప దర్శనిగా ప్రేక్షకులను థియేటర్‌కు తీసుకొచ్చి, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి చిన్న సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎంతో ముఖ్యం. ఈ సినిమా తప్పకుండా అందర్నీ అలస్తుంది’ అని ప్రియదర్శి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -