Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతీవ్ర విషాదం.. మంజీరా నదిలో మునిగి బావ, బావమరిది మృతి

తీవ్ర విషాదం.. మంజీరా నదిలో మునిగి బావ, బావమరిది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో ఆదివారం ఉదయం ఒక తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంజీరా నదిలో మునిగి బావ, బావమరిది ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మండల కేంద్రానికి చెందిన గంగొండ (43), ఆయన బావ అయిన రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన గంగారం (50), గంగొండ చిన్న కుమారుడు సంతోష్‌తో కలిసి ఆదివారం ఉదయం గొర్రెలను కడిగేందుకు మంజీరా నదికి వెళ్లారు. అక్కడ నదిలో గొర్రెలను శుభ్రం చేస్తున్న సమయంలో గంగారం ప్రమాదవశాత్తు లోతులోకి వెళ్లి నీటిలో మునిగిపోయారు. గమనించిన గంగొండ తన బావను కాపాడేందుకు తక్షణమే రంగంలోకి దిగి ప్రయత్నించినప్పటికీ, దురదృష్టవశాత్తు ఆయన కూడా నీట మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో గ్రామంలో తీవ్ర శోకసంద్రం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -