Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటర్ల సంఖ్య అధారంగా డివిజన్లు పెంచాలి

ఓటర్ల సంఖ్య అధారంగా డివిజన్లు పెంచాలి

- Advertisement -

– మంత్రి శ్రీధర్ బాబు, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డికి వినతిపత్రం
– మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్
నవతెలంగాణ-బోడుప్పల్: 
గ్రేటర్ హైదరాబాదు లో నూతన డివిజన్ల పెంపు అంశంలో విలీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ఓటర్ల సంఖ్యను బట్టి డివిజన్ల సంఖ్య ఉండేలా మరోసారి ప్రభుత్వం పూనారలోచన చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిలను మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్,మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ల అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ లో విలీనం చేయాడం స్వాగతించాల్సిందే కానీ అయా ప్రాంత ఓట్ల ఆధారంగా డివిజన్ల సంఖ్య పెంచాలని కోరారు.

బోడుప్పల్ కార్పొరేషన్ లో 98 వేల ఓట్లు ఉండగా కేవలం రెండు డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేశారని, జవహర్ నగర్ 88 వేల ఓట్లు ఉండగా రెండు డివిజన్లు ఏర్పాటు చేశారని, పీర్జాదిగూడ కార్పొరేషన్ లో 98 వేల ఓట్లకు రెండు డివిజన్లు, నాగారం 61 వేల ఓట్లు ఉండగా 1 డివిజన్, పోచారం 56 వేల ఓట్లకు 1 డివిజన్ చొప్పున ఏర్పాటు చేశారని ఈ అంశంలో స్థానిక ప్రజల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని దీనిని మరోసారి సమీక్షించుకుని ఓట్ల సంఖ్యను బట్టి డివిజన్ల సంఖ్యను పెంచాలని కోరారు.

దీనికి మంత్రి శ్రీధర్ బాబు, సీఎం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి తో పాటు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతామని తెలిపినట్లు డీసీసీ అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్ తెలిపారు. మంత్రి, సలహాదారును కలిసిన వారిలో మాజీ డీసీసి అధ్యక్షుడు హరివర్దన్ రెడ్డి, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, పీర్జాదిగూడ మాజీ డిప్యూటీ మేయర్ కర్ర శివకుమార్ గౌడ్ తో పాటు మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -