Friday, July 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండాక్టర్‌ ‌సత్యవోలుకు పీహెచ్‌‌డీ

డాక్టర్‌ ‌సత్యవోలుకు పీహెచ్‌‌డీ

- Advertisement -


నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో

డాక్టర్‌ సత్యవోలు రామ విజయ కుమార్ పీహెచ్‌‌డీ పట్టా పొందారు. ఆయన విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ వెంకట సుబ్బయ్య పర్యవేక్షణలో ‘డిజైన్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ సప్లై చైన్స్ విత్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ’ అనే అంశంపై పరిశోధన చేసి మెకానికల్ ఇంజినీరింగ్ (ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్)లో పీహెచ్‌‌డీ పట్టా పొందారు. ఈ పరిశోధనలో ఆరోగ్య మరియు విపత్తు నిర్వహణ రంగాలలోని ప్రభుత్వం నుంచి ప్రజలకు సరఫరా వ్యవస్థలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఆప్టిమైజేషన్ నమూనాలు, బహుళ ప్రమాణ నిర్ణయ విధానాలు, బ్లాక్‌చెయిన్ సాంకేతికతను సమగ్రంగా అనుసంధానిస్తూ వినూత్న ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనలో సామర్థ్యం, పారదర్శకత, వనరుల సమర్థ వినియోగం, చివరి దశ సేవల పంపిణీ గణనీయమైన మెరుగుదల ఎలా సాధించవచ్చో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -