Tuesday, July 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం7.1 తీవ్రతతో జపాన్ లో భూకంపం

7.1 తీవ్రతతో జపాన్ లో భూకంపం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషులోని కుమమోటో ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికను జపాన్ వాతావరణ శాఖ (జెఎంఎ) జారీ చేసింది. జపాన్ కాలమానం ప్రకారం సాయంత్రం 4:29 గంటలకు సంభవించిన ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు జేఎంఏ వెల్లడించింది. భూకంప కేంద్రం టోక్యోకు నైరుతి దిశలో సుమారు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమమోటో పశ్చిమ ప్రాంతంలో గుర్తించారు. భూకంపం సంభవించిన వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం, గాయాలు లేదా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. అమెరికాకు చెందిన పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం (పిటిఎంసి) కూడా స్పందిస్తూ, ఈ భూకంపం కారణంగా స్థానిక తీరప్రాంతాలకు ఆవల ఇతర ప్రాంతాలకు సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. అయితే, తీరప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -