Friday, September 18, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీలో కార్మికులు ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికలకు ఎట్టకేలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 21 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబరు 9న ఎన్నికలు నిర్వహించి, 17న ఫలితాలు వెల్లడించనున్నట్టు అధికారులు తెలిపారు. 2016 జులై 19న ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించగా.. మళ్లీ ఇప్పుడు జరుగుతున్నాయి.

ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు

సెప్టెంబర్ 21 (సోమవారం): పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న యూనియన్లు సమ్మతి పత్రాలను సమర్పించడం.
సెప్టెంబర్ 22 (మంగళవారం): ఆయా డిపో మేనేజర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను సంబంధిత జిల్లాల డిప్యూటీ రిటర్నింగ్ అధికారులకు అందజేయడం, యూనియన్ల నుంచి అభ్యంతరాలు కోరడం.
సెప్టెంబర్ 24 (గురువారం): ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు ఆఖరి తేదీ.
సెప్టెంబర్ 25 (శుక్రవారం): సంబంధిత డిపో మేనేజర్లు/యూనిట్ అధికారులతో చర్చించి అభ్యంతరాలను పరిష్కరించి తుది రూపు ఇవ్వడం.
సెప్టెంబర్ 26 (శనివారం): పోటీ చేసే యూనియన్లకు తుది ఓటర్ల జాబితా పంపిణీ, పోటీలో ఉండే యూనియన్లకు గుర్తుల కేటాయింపు, జిల్లాల డీసీఎల్లు తుది ఓటర్ల జాబితాను ప్రధాన రిటర్నింగ్ అధికారికి సమర్పించడం.
సెప్టెంబర్ 29 (మంగళవారం): పోటీ చేసే యూనియన్లు నమూనా బ్యాలెట్ పత్రాలను డీసీఎల్ వద్ద నుంచి సేకరించడం.
అక్టోబర్ 09 (శుక్రవారం): పోలింగ్ తేదీ (ఉదయం 5:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు).
అక్టోబర్ 14 & 15: పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ.
అక్టోబర్ 17 (శనివారం): ఫలితాల ప్రకటన
గుర్తింపు ఇలా
ఆర్టీసీలో అనేక కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో గెలిచిన సంఘాలనే గుర్తింపు సంఘంగా పరిగణిస్తారు. ఈ గుర్తింపు సంఘాలు రీజియన్, రాష్ట్రస్థాయిలో ఉంటాయి. రెండింటికీ వేర్వేరు బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తారు. కార్మికుల వేతనాలు, బోనస్‌లు, డీఏలు, సర్వీస్‌ నిబంధనలు తదితర సమస్యలపై సంస్థ యాజమాన్యం ప్రభుత్వంతో చర్చలు జరిపే చట్టబద్ధమైన హక్కు ఈ సంఘానికే ఉంటుంది. కార్మికుల తరఫున ఒప్పందాలు చేసుకోవడంలోనూ గుర్తింపు సంఘం కీలకంగా వ్యవహరిస్తోంది. రీజియన్‌లో పనిచేసే అధికారి స్థాయి మినహా మిగిలిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులందరికీ ఓటు హక్కు ఉంటుంది. 2018లో ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా అప్పటి ప్రభుత్వం నిర్వహించలేదు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -