Sunday, July 5, 2026
E-PAPER
Homeదర్వాజకదిలితేగాని

కదిలితేగాని

- Advertisement -

రోడ్డు పై
ఏది నడిచినా
అది కనిపించక
కళ్ళు కాయలు కాస్తున్నది
పెద్ద పెద్ద కార్లు
రొమ్ము విరుచుకు తిరుగుతున్నా….
కుర్రకారు కొమ్ములు తిరిగిన
బైక్ లు మెలికలు పోయినా
అది కనిపించక పోతే రోడ్డు
ఒంటె లేని ఎడారిలా ఉంది
అదొక సజీవ ప్రపంచం కదా
ఎన్ని అంతులేని కథల భారమో కదా
బస్సు తిరగని రోడ్డు
నీళ్లు లేని బావిలా ఉంది
రోడ్డు మెడకు బస్సే
పెట్టని ఆభరణం
ప్రయాణ మంటే
స్థలం మారడమేనా?
జీవితాలను స్వప్నించడం
ఆశకు ఆయువును ఇవ్వడం
ఎన్నెన్ని జీవిత శకలాల
బరువును అందుకోవడం కదా
ఏమైనా
కదిలితే గాని
కన్నీళ్లు ఆగవు
ఆకు కదిలినట్టు
మబ్బు కదిలినట్టు
పక్షి కదిలినట్టు
ఆశ చావనట్టు
మనిషి కదలాలి
కాలు ఐనా
చక్రమైనా – కదిలితేనే…..
సుంకర రమేశ్, 9492180764

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -