- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో తల్లితో పాటు నాలుగేళ్ల కుమారుడు మృతి చెందారు. మృతులను వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. ప్రకాశ్‌రెడ్డి-నందిని దంపతులు యాదగిరిగుట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రకాశ్‌రెడ్డికి తీవ్రగాయాలు కాగా వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -



