– పట్టించుకోని పోలీస్ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ
నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలో గంజాయి స్మగ్లింగ్ చాపనీద నీరులా రాకుతుంది. దీనికి ఇటీవల మంగళవారం జరిగిన సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు. గతంలో కూడా చుక్కల మండలంలోని గ్రామాలలో గంజాయి వంట సాగు భారీగా కొనసాగుతూ వచ్చేది. అప్పటి అధికారులుగా వేల వేసి పట్టుకొని వాటిని ధ్వంసం చేసి నిందితులను పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగింది. అప్పటిలో కౌలాస్ పరిధిలోని వ్యవసాయ భూమిలో సుమారుగా 500 గంజాయి ముక్కలు ఐదు ఎకరాల పత్తి పంట సాగులో అంతర్ పంటలు పండించడం జరిగింది. అదేవిధంగా పెద్దగుళ్ల గ్రామంలో వ్యవసాయ బండ భూమిలో గంజాయి సాగు పట్టు నమోదు చేశారు. ఇటీవల రెండు సంవత్సరాల క్రితం జుక్కల్ మండలంలోని హంగర్గా గ్రామంలో వ్యవసాయ భూములు వెండెకరాల లో గంజాయి సాగు చేస్తున్న రైతును పట్టుకుని కేసు నమోదు చేశారు. ఇటీవల మంగళవారం నాడు జుక్కల్ మండలంలోని సావర్ గావ్ గ్రామంలోని మైసమ్మ గుడి వద్ద పక్క సమాచారం మేరకు ముగ్గురు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని జుక్కల్ ఎస్సై మురళికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పట్టుబడిన ముగ్గురు నిందితులు 1). జుక్కల్ మండలం సావర్ గావ్ తాండ నివాసి పవార్ రామారావు ,2). ముల్గే బాబు కంగ్టీ మండలం సంగారెడ్డి జిల్లా వాసి, 3). పవార్ శ్రావణ్, కంగ్టీ మండలం, సంగారెడ్డి జిల్లా వాసి ఉన్నారు. గణపతి అనే నిందితుడు పరారీలో ఉన్నారని నార్కోటిక్ కంట్రోల్ సేల్ నిజామాబాద్ అధికారి నార్కోటిక్ సిఐ పూర్ణేశ్వర్ తెలిపారు.
మండలంలో ఏరులై పారుతున్న గంజాయి స్మగ్లింగ్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



