Sunday, May 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువీఆర్‌ఏలకు ఇచ్చిన

వీఆర్‌ఏలకు ఇచ్చిన

- Advertisement -

హామీలు అమలుచేయాలి
జీవో 81, 85 ప్రకారం వారసులకు ఉద్యోగాలివ్వాలి
జేఏసీ కన్వీనర్‌ వంగూరు రాములు
సీసీఎల్‌ఏ కార్యాలయం ఎదుట ధర్నా
చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఎన్నికల సమయంలో వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. రెండు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలి. జీవో 81, 85 ప్రకారం వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. కారుణ్య నియామకాలు చేపట్టాలి’ అని వీఆర్‌ఏలు డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏ జేఏసీ కన్వీనర్‌ వంగూరు రామలు మాట్లాడుతూ వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలిస్తామంటూ ఎన్నికల సమయలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 61ఏండ్లు నిండిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20,555 మంది వీఆర్‌ఏల్లో డిగ్రీ చదివిన వారిని జూనియర్‌ అసిస్టెంట్లుగా, ఇంటర్‌ చదివిన వారిని రికార్డు అసిస్టెంట్లుగా, పదో తరగతి లోపు చదివిన వారిని ఆఫీస్‌ సబార్డినేటర్లుగా రెవెన్యూ శాఖతో పాటు, మున్సిపల్‌, ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ, విద్యా, వైద్య తదితర శాఖల్లో ఉన్న ఖాళీల్లో 16,758 మంది వీఆర్‌ఎలను ప్రభుత్వం సర్దుబాటు చేసిందని గుర్తు చేశారు. మిగతా 3,797 మంది వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా గత రెండున్నర ఏండ్లుగా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. జీఓ 81, 85 ప్రకారం ఉద్యోగాలొస్తాయనే ఆశతో వారు రెండున్నరేండ్లుగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం జీఓ ఇచ్చిన తర్వాత ఉద్యోగం రాకుండా పోతుందా అని కుటుంబాల్లో ఆస్తి ఒప్పందాలు చేసుకున్నారని గుర్తు చేశారు. అప్పులు చేసి తమ సోదరులకు వాటా కింద ఇచ్చారన్నారు. కానీ ఉద్యోగం రాక పోవటంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి వారు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 340 మందికి పైగా వీఆర్‌ఏలు మరణించారని తెలిపారు. అనేకమంది అనారోగ్యాలతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను, రెవెన్యూ అధికారులను కలిసి దండం పెట్టి వినతి పత్రా లు సమర్పించినా..ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. పలు రూపాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వం ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదని విమర్శించా రు. ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలని నిలదీశారు. ఇంకా ఎంతమంది చనిపోతే ఈ ప్రభుత్వానికి కనికరం కలుగుతుందని ప్రశ్నించారు. వీఆర్‌ఏలలో 50 నుంచి 60 శాతం ఎస్సీ సామాజిక తరగతికి చెందినవారే ఉన్నారని తెలిపారు. అందుకే ఈ వివక్షా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మధు, రమేష్‌ పటేల్‌, శివ,రమేష్‌ కుమార్‌, రాజశేఖర్‌, వెంకటేశ్‌, మన్నె సాగర్‌ పాల్గొని మాట్లాడారు.

సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ
వీఆర్‌ఏల సమస్యల పరిష్కారంపై శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. చర్చల్లో వీఆర్‌ఏల తరుపున జేఏసీ కన్వీనర్‌ వంగూరు రాములు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -