Thursday, July 2, 2026
E-PAPER
Homeఖమ్మంఅర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం కృషి

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం కృషి

- Advertisement -

– అశ్వారావుపేటలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ
– మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జూపల్లి రమేష్ బాబు మాట్లాడుతూ, రేషన్ కార్డు కేవలం బియ్యం పొందేందుకు మాత్రమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుందని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో అనేక మంది అర్హులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ సంవత్సరాల తరబడి రేషన్ కార్డులు మంజూరు కాక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి అర్హులను గుర్తిస్తూ పెద్దఎత్తున కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తోందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలోనూ అర్హులైన ఒక్క కుటుంబం కూడా ప్రభుత్వ పథకాలకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సంక్షేమ ఫలాలు ప్రతి పేద కుటుంబానికి చేరేలా కృషి జరుగుతోందని వివరించారు.

అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లక్ష్యమని పేర్కొన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా తదితర సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. రేషన్ కార్డులు లేని అర్హ కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమానికి దూరం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు తమ సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత రేషన్ కార్డులు అందడం ఆనందంగా ఉందని, ఇకపై ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందగలమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మిండా హరిబాబు, తిరుమలశెట్టి వెంకన్నబాబు,నార్లపాటి దివాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, మండల యూత్ నాయకుడు జూపల్లి ప్రమోద్, టౌన్ అధ్యక్షుడు నండ్రు రమేష్, షేక్ సైదు బాజీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -