వంటగదిలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ప్రధాన సమస్య ‘కూర అడుగంటడం’. ఒక్క నిమిషం అజాగ్రత్తగా ఉన్నా లేదా మంట ఎక్కువగా ఉన్నా కూర మాడిపోతుంది. దీనివల్ల కూర అంతటా ఒక రకమైన చేదు వాసన వచ్చేస్తుంది. అయితే, ఇలాంటప్పుడు కూరను పారేయకుండా మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు కొన్ని చిట్కాలు పాటించవచ్చు.
ఐస్ క్యూబ్స్ చిట్కా.. తక్షణ పరిష్కారం
కూర అడుగంటినట్లు మీకు అనిపించిన వెంటనే, మంట ఆపేయాలి. అందులో 2 నుండి 3 ఐస్ క్యూబ్స్ వేయాలి. అవి కరిగే వరకు అలాగే ఉంచడం వల్ల కూరలోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గి, మాడిన వాసన కూరలోని పై భాగాలకు వ్యాపించకుండా ఉంటుంది.
పాత్రను మార్చడం మర్చిపోకండి
కూర మాడిందని తెలిసిన వెంటనే చేయాల్సిన మొదటి పని.. ఆ పాత్రలోని పైన ఉన్న మాడని భాగాన్ని జాగ్రత్తగా వేరే శుభ్రమైన గిన్నెలోకి మార్చడం. అడుగున అంటుకున్న మాడిన భాగాన్ని అస్సలు గీకకూడదు. అలా గీకడం వల్ల మాడిన నలుపు, వాసన మొత్తం కూరలోకి కలిసిపోయి రుచి పాడవుతుంది.
బంగాళదుంప ముక్క: కూరలో మాడిన వాసన ఎక్కువగా వస్తుంటే, ఒక పచ్చి బంగాళదుంపను ముక్కలుగా కోసి కూరలో వేసి పది నిమిషాలు ఉంచండి. బంగాళదుంపకు మాడిన వాసనను పీల్చుకునే శక్తి ఉంటుంది.
పాలు లేదా పెరుగు: గ్రేవీ కూరలు లేదా పప్పు వంటివి అడుగంటినప్పుడు, కొంచెం పాలు లేదా పెరుగు కలిపి కాసేపు ఉడికిస్తే మాడిన రుచి పోయి కొత్త రుచి వస్తుంది.
నిమ్మరసం: వేపుడు కూరలు మాడిపోతే, చివరలో కొంచెం నిమ్మరసం చల్లడం వల్ల ఆ చేదు వాసన తగ్గుతుంది.
హార్మోన్లఅసమతుల్యతా..
- Advertisement -
- Advertisement -



