నవతెలంగాణ – హైదరాబాద్
పాక్ రాజధాని ఇస్లామాబాద్‌పై భారత సైన్యం దాడి చేసింది. ఇస్లామాబాద్ టార్గెట్‌గా భారత్ డ్రోన్లు, మిస్సైల్‌లతో దాడికి దిగింది. పాక్ మిస్సైల్‌లను గాల్లోనే కూల్చి వేసిన భారత సైన్యం. జమ్మూలోని ఎయిర్‌పోర్టుపై 8 సూసైడ్ డ్రోన్లతో పాక్ దాడి చేయగా వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. జైసల్మేర్, అక్నూర్‌లో ఇద్దరు పాక్ పైలట్‌లను పట్టుకున్న భారత ఆర్మీ. మొత్తం 20కి పైగా పాక్ డ్రోన్లను భారత్ కూల్చివేసింది. సైన్యం లాహోర్ , సియాల్ కోర్టులో కౌంటర్ ఎటాక్‌కు దిగిన భారత్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 14 మంది పాక్ సైనికులు హతమైనట్టు సమాచారం. S-400, L-17 సిస్టమ్‌ను యాక్టివేట్ చేసిన భారత్. జమ్మూ ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా పాక్ దాడులు. ఈ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని, పాక్ దాడులను సమర్ధవంతగా తిప్పికొట్టామని భారత ఆర్మీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులను హై అలర్ట్ చేసిన భారత్ సైన్యం. వరుస డ్రోన్ దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరి అయింది.
ఇదిలా ఉండగా అమెరికా, యూకే, యూఏఈలతో భారత్ టచ్‌లో ఉంది. రంగంలోకి SZU-23, శిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తాజా పరినామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సమావేశం అయ్యారు. త్రివిధ దళాధిపతులు, CDSతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు.
రంగంలోకి భారత నౌకాధళం: రంగంలోకి దిగిన భారత నౌకాధళం పాకిస్తాన్ ఆర్థిక రాజధానికరాచీ సీ పోర్టుపై ప్రతీకార దాడి చేసింది. ఐఎన్‌ఎస్ విక్రాంత నుంచి మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించింది. ఈ పోర్టులో ఏడు భారీ పేలుళ్లు, ఎగిసిపడుతున్న మంటలు. కరాచీ పోర్టులో మొత్తం 10 పాక్ కార్గో నౌకలను ద్వంసం చేసిన ఇండియన్ నేవీ. ఈ దాడుల్లో అనేక షిప్పులు ధ్వంసం అయ్యాయి. అరేబియా సముద్రంలో పాక్‌పై గురి పెట్టిన భారత నేవీ ఏకంగా 26 యుద్ధ నౌకలతో విరుచుకుపడుతూ పాక్‌ను వణికిస్తోంది.
దేశంలో పలు ప్రాంతాల్లో రైళ్లు నిలిపివేత : తాజా పరినామాలతో దేశంలో ఢిల్లీ నుంచి జమ్మూ,గుజరాత్, రాజస్థాన్ వెళ్లే రైళ్లన్నీ రద్దు చేశారు.
ఢిల్లీలో హై అలర్ట్ : తాజా పరినామాలతో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ధ భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం. ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. భారీగా NSG కమాండర్ల మోహరింపు. ఢిల్లీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర సేవల కింద యదావిధిగా ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశించింది.
పాక్‌పై భారత్ మిస్సైల్స్ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES