నవతెలంగాణ-హైదరాబాద్: ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థుల పట్ల కర్కషంగా వ్యవహరిస్తుంది. ఇప్పటీకే వీసా నిబంధనలను కఠిరతరం చేసి విద్యార్థుల రాకపై నిఘా పెంచింది. అంతేకాకుండా ఆ దేశంలో ఉన్న విదేశీ విద్యార్థులపై డేగ కన్ను వేసి..నిబంధనల పేరుతో పలు ఇబ్బందులకు గురి చేస్తుంది. అక్రమ వలసదారులంటూ చేతులకు బేడీలు చేసి..అవమానకర రీతిలో వారిని విమానంలో స్వేదేశానికి పంపిన దృశ్యాలు మరువక ముందే..తాజాగా అమెరికాలో భారతీయ విద్యార్థికి ఘోరమైన అవమానం జరిగింది.
న్యూజెర్సీలోని నెవార్క్ విమానాశ్రయంలో భారతీయ విద్యార్థిని భద్రతాధికారులు నేలపై పడేసి.. చేతులను వెనక్కి పెట్టి సంకెళ్లు వేశారు. సుమారు నలుగురు అధికారులు అతనిని గట్టిపట్టుకోగా, వారిలో ఇద్దరు అధికారులు అతని వీపుపై మోకాళ్లను ఉంచి నొక్కి పెట్టారు. ఈ ఫోటోలు, వీడియోను ప్రత్యక్ష సాక్షి, ఎంటర్‌ప్రెన్యూర్ కునాల్ జైన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వలసలదారులపై కఠిన చర్యల పేరుతో అమెరికా అధ్యక్షులు ట్రంప్ వందలాది మంది భారతీయ విద్యార్థులను భారతదేశానికి పంపిన తీరును గుర్తుకు తెచ్చింది.