Wednesday, June 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా సైనిక ఎయిర్‌బేస్‌పై ఇరాన్ దాడి

అమెరికా సైనిక ఎయిర్‌బేస్‌పై ఇరాన్ దాడి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా ద‌ళాల‌పై ఇరాన్(Iran Strikes) విరుచ‌కుప‌డింది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా ద‌ళాల‌కు చెందిన‌ ఎయిర్‌బేస్‌పై క్షిప‌ణి దాడి చేసింది ఇరాన్‌. అయితే ఈ దాడి గురించి జోర్డాన్ కానీ, అమెరికా కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. మువాఫ‌క్ సాల్టీ ఎయిర్ బేస్‌పైకి క్షిప‌ణుల‌తో దాడి చేసిన‌ట్లు ఇరానీ పారామిలిట‌రీ రెవల్యూష‌న‌ర్ గార్డులు పేర్కొన్నారు. ఈ ఎయిర్‌బేస్‌లో అమెరికాకు చెందిన ఎఫ్‌-35 యుద్ధ విమానాలతో పాటు ఇత‌ర విమానాలు ఉన్నాయి. హోర్ముజ్ వ‌ద్ద మంగ‌ళ‌వారం అమెరికాకు చెందిన ఆర్మీ అపాచీ హెలికాప్ట‌ర్ కూలిన విష‌యం తెలిసందే. ఆ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఇరాన్‌పై అమెరికా దాడుల‌కు దిగింది. దీంతో ఆ దాడుల్ని తిప్పికొట్టేందుకు ఇరాన్ ప్ర‌తిదాడులు చేస్తోంది. బుధ‌వారం అమెరికా మిలిట‌రీ వైమానిక దాడుల‌కు పాల్ప‌డింది. అయితే ఇరాన్ కౌంట‌ర్ దాడికి దిగింది. దీంతో బ‌హ్రెయిన్ ద్వీపంపై కూడా దాడి జ‌రిగిన‌ట్లు తెలుస్తోంద‌. ఆ ద్వీపంలో అమెరికా నౌకాద‌ళానికి చెందిన ఫిప్త్ ఫ్లీట్ బ‌స చేస్తోంది. అయితే ఆ నౌకాద‌ళంపై ప్ర‌తీకార దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఇరాన్ పేర్కొన్న‌ది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -