Thursday, March 26, 2026
E-PAPER
Homeసినిమాభిన్న కథతో 'ఇరుముడి'

భిన్న కథతో ‘ఇరుముడి’

- Advertisement -

హీరో రవి తేజ నటిస్తున్న కొత్త చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. మేకర్స్‌ ఇప్పటికే రవి తేజ, ప్రియా భవానీ శంకర్‌ల ఫస్ట్‌ లుక్‌ను పోస్టర్‌ను విడుదల చేసి, అందరి లోనూ క్యూరియాసిటీని పెంచారు. ఈ సినిమా షూటింగ్‌ శర వేగంగా సాగుతోందని, ఇప్పటికే 50% షూటింగ్‌ పూర్తయిందని మేకర్స్‌ ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర బృందం హైదరాబాద్‌లో హై-ఆక్టేన్‌ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. అనల్‌ అరసు, రియల్‌ సతీష్‌ స్టంట్‌ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో చూడనటువంటి అత్యంత అద్భుతమైన ఫైట్‌లను ప్రేక్షకులు చూడబోతున్నారని టీం చెబుతోంది. యాక్షన్‌ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ ఇందులో అద్భుతమైన కథ, కాన్సెప్ట్‌ ఉంటుంది.

అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్‌ అద్భుతంగా ఉండబోతోన్నాయని మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్స్‌, కంటెంట్‌ చెబుతోంది. దర్శకుడు శివ నిర్వాణ ఒక కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌కు అవసరమైన అన్ని అంశాలను, బలమైన భావోద్వేగ ప్రధానాంశంతో సమతుల్యం చేస్తూ ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌ను రూపొందించారు. రవి తేజ తాను ఇంతకు ముందు పోషించిన పాత్రల్లన్నింటిలోనూ భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తన కుమార్తెగా నటించిన బేబీ నక్షత్రతో రవి తేజకు ఉన్న బంధాన్ని చూపిస్తూ, చిత్ర బృందం ఒక అందమైన, ఆకట్టుకునే పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌ చూస్తుంటే తండ్రీకూతుళ్ళ మధ్య మంచి ఎమోషనల్‌ సీన్లను సినిమాలో చూపించేలా ఉన్నారనిపిస్తోంది. ప్రియా భవానీ శంకర్‌, సాయి కుమార్‌, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్‌, రమేష్‌ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్‌, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, రమణ భార్గవ్‌ తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -