Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంయెమెన్ ఓడ‌రేవుపై ఇజ్రాయిల్ దాడి

యెమెన్ ఓడ‌రేవుపై ఇజ్రాయిల్ దాడి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: యెమెన్‌లోని హౌతీల ఆధీనంలో ఉన్న ఓడరేవు నగరం హోడైడాపై ఇజ్రాయిల్‌ నావికాదళం మంగళవారం దాడి చేసింది. ఇజ్రాయిల్‌ సైన్యం, నేవీ క్షిపణి నౌకలు ఈదాడులు చేపట్టాయని, హౌతీ తిరుగుబాటుదారులపై తమ దళాలు దాడులు చేపట్టడం ఇదే మొదటిసారని తెలిపింది. తమపై దాడులకు సముద్ర ఓడరేవులను వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ రాస్‌ ఇసా, హొడైడా మరియు అల్‌-సలీఫ్‌ ఓడరేవులను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయిల్‌ సోమవారం యెమన్‌కు ఆన్‌లైన్‌లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఓడరేవుల్లో ఆయుధాలను రవాణా చేసేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తోందని ఆరోపించింది. హౌతీలు పౌర మౌలిక సదుపాయాలను దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది మరో ఉదాహరణని ఇజ్రాయిల్‌ ఆరోపించింది. ఈ దాడిని హౌతీలు తీవ్రంగా ఖండించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img