డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, డెబ్యూ దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ లాంచ్ చేశారు.
హీరో అనీష్ మాట్లాడుతూ,’ ఈ కథని మహేష్ చాలా అద్భుతంగా చెప్పారు. అర్జున్ క్యారెక్టర్‌కి కనెక్ట్ అయిపోయాను. ఈ సినిమా మీకు గుర్తుండిపోతుంది. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది’ అని చెప్పారు. నిర్మాత వెంకీ కుడుముల మాట్లాడుతూ,’ ఇందులో అనీష్ పర్ఫార్మెన్స్ చూశాను. తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నిర్మాతగా నేను చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను అనిపించింది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీల్ అవుతారు. మహేష్ తను చెప్పిన కథను స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది’ అని తెలిపారు. అనస్వర రాజన్ మాట్లాడుతూ,’ నేను తెలుగులో సైన్ చేసిన ఫస్ట్ ఫిలిం. ఇది నాకు చాలా స్పెషల్. కీర్తి క్యారెక్టర్ చేయడం నేను చాలా ఎంజాయ్ చేశాను. తప్పకుండా కీర్తి మీ అందరికీ చాలా నచ్చుతుంది’ అని చెప్పారు. దర్శకుడు మహేష్ ఉప్పల మాట్లాడుతూ,’ ఈ కథని నమ్మిన వెంకీకి థాంక్యూ. నేను సినిమా బాగా తీయగలను అనే నమ్మకాన్ని అనీష్ ఇచ్చాడు. అనస్వర అద్భుతంగా పర్ఫామ్ చేసింది. తమన్ ఈ సినిమాని ఎంత ప్రేమించి చేశారో అక్టోబర్ 30వ తేదీన మీకు అర్థమవుతుంది’ అని తెలిపారు.
‘ఇట్లు అర్జున’ బ్యూటీఫుల్ సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



