- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం కీలక ప్రకటన చేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్‌లో పలు దేవాలయాల్లో కవిత దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్)లో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో తన భర్త దేవనపల్లి అనిల్‌తో కలిసి కవిత పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆమె తాను పెట్టబోయే కొత్త పార్టీ, ఎజెండా తదితర కీలక అంశాలను వెల్లడిస్తారని భావిస్తున్నారు.
- Advertisement -



