Saturday, August 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలురూ.50 వేల కోట్ల స్కామ్‌ నేపథ్యంలో ‘కింగ్‌ 100’

రూ.50 వేల కోట్ల స్కామ్‌ నేపథ్యంలో ‘కింగ్‌ 100’

- Advertisement -

అగ్ర కథానాయకుడు నాగార్జున నటిస్తున్న 100వ చిత్రం రా కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా పవర్‌ఫుల్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నాగార్జున వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమయ్యే గ్లింప్స్‌లో సమాజం మనుషులను వారి సంపద ఆధారంగా ఎలా విభజిస్తుందనే అంశాన్ని ఆసక్తికరంగా ప్రస్తావించారు. తన దగ్గర ఏమీ లేనప్పుడు తనను ‘లూజర్’ అని పిలిచారని, అదే సంపద సంపాదించిన తర్వాత ‘ది కింగ్’ అని పిలుస్తున్నారని నాగార్జున చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మరోవైపు నాగార్జున ఫొటోతో పాటు రూ.50,000 కోట్ల భారీ స్కామ్‌కు సంబంధించిన వార్తను చూపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. డైరెక్టర్ రా కార్తీక్ స్టొరీ టెల్లింగ్‌ కూడా ఫ్రెష్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, రిచ్ విజువల్స్ గ్లింప్స్‌ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ ఇంపాక్ట్‌ను మరింత పెంచింది. టబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -