Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకొండా సురేఖకు ఢిల్లీ నుంచి పిలుపు

కొండా సురేఖకు ఢిల్లీ నుంచి పిలుపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆమెకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు అందింది. వెంటనే బయలుదేరి రావాలని పార్టీ పెద్దల నుంచి ఆమెకు సందేశం అందినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి తొలగించిన మరుసటి రోజే హైకమాండ్ రంగంలోకి దిగడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. నిన్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, కొండా సురేఖతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని, అధిష్ఠానం అండగా ఉంటుందని ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సంభాషణ జరిగిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ నుంచి పిలుపు రావడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -