- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు పట్నాలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, కుమార్తె, రాజ్యసభ ఎంపీ మీసా భారతి వెంట ఉన్నారు. 76 ఏళ్ల లాలూ వయసు, గత ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -


