నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రానికి చెందిన సాయితేజ ఎంబిబిఎస్‌లో సీటు సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్థానికులు సాయితేజను అభినందించారు. అదేవిధంగా శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. మద్నూర్ గ్రామానికి చెందిన సంతోష్ మేఘన దంపతుల కుమారుడైన సాయితేజ తెలంగాణ రాష్ట్రంలో 866వ ర్యాంకు సాధించారు. అంతర్జాతీయ బోర్డ్ ప్రకటించిన ఫలితాల్లో 67146 ర్యాంకు సాధించినట్లు కుటుంబీకులు తెలిపారు. సాయితేజ వరంగల్ల్లో మెడికల్ కళాశాలలో అడ్మిషన్ పొందాడు. అనంతరం విద్యార్థిని నాందేవ్ మేస్త్రి, రచ్చ కుసాల్, శ్రీధర్ సుంకి, సంతోష్ అంబటివార్ పెంటేష్ రచ్చావార్, నాగేష్ గొండ, నాగేష్ రచ్చవార్, నాగేష్ ఊత్తూరువార్, యాదవ్ రావు మేస్త్రి పలువురు సన్మాన కార్యక్రమంలో పాల్గొని అభినందించారు.
మద్నూర్ విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



