నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లొంగన్ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా చేప వల చిక్కుకుపోయి మరణించినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని లొంగన్ పెద్ద చెరువులో ముదిరాజ్ మారుతి (45) మద్యం కృపా మినిస్ట్రీ గ్రామంలో కూలి పని చేసుకుని జీవితం గడిపే వాడని తెలిపారు. శుక్రవారం నుండి గ్రామంలో కనిపించడం లేదని, గ్రామంలో ఎక్కడైనా ఉండొచ్చని అనుకున్నామని వెల్లడించారు. అయితే మృతుడి భార్య కూడా గ్రామంలో ఉండట్లేదని, తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో వస్తాడులే అనుకుని ఉన్నారని తెలిసింది. మద్యం తాగి చేపలు పట్టేందుకు గ్రామంలోని చెరువులోకి వెళ్లి వలకు చిక్కుకొని మరణించినట్టు తెలిపారు. శనివారం గ్రామస్తులు చెరువు దగ్గర చూసి మాకు సమాచారం అందించారని తెలిపారు. మృతుడికి భార్యా విమల, ఒక కూతురు ,ఒక కొడుకు ఉన్నారని చెప్పారు. ఇటీవలే కొడుకు వివాహం కూడా చేశారని తెలిపారు. ఇంతలోనే ఇలా జరిగిందని వాపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు.
లొంగన్ చెరువులో వ్యక్తి అనుమానాస్పద మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



