- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ మాదాపూర్‌లో క్షణికావేశం తీవ్ర విషాదానికి దారితీసింది. కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందన్న కోపంతో ఓ డ్రైవర్ దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ను కిలోమీటర్ల మేర వెంబడించి కారుతో ఢీకొట్టాడు. ఈనెల 7న బోరబండకు చెందిన భూమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి భార్య వసుంధరను ఆఫీస్‌లో దించేందుకు వెళ్తుండగా అయ్యప్ప సొసైటీ వద్ద ఈ ఘటన జరిగింది. కారు ఢీకొట్టడంతో బైక్ మరో కారును ఢీకొని బోల్తాపడగా.. దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదుతో నిందితుడు ఫణింద్రకుమార్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



