నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో పలువురు బాధిత కుటుంబాలను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం పరామర్శించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త వడ్ల రమేష్, నాన్న ఇటీవల మరణించారు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ వాళ్ల నాన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల అనారోగ్యాలకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వెంట వివిధ మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ గ్రామ సర్పంచులు, ఉపసర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



