నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలోని జెఎంజె పాఠశాలపై వచ్చిన అభియోగాలపై మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మీ శనివారం పాఠశాలను సందర్శించి, ఎంక్వయిరీ చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆమె తెలుసుకున్నారు. ఎంక్వయిరీలో సీబీఎస్ఈ గైడ్ లైన్స్ ప్రకారము విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉన్నందున, విద్యార్థుల తల్లిదండ్రులకు , విద్యార్థుల యొక్క ప్రగతిని వివరించడం, సిబిఎస్ఈ పదవ తరగతి పరీక్ష విధానానిన వివరించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు టిసి అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాతనే టిసిని ఇచ్చామని, కావాలని విద్యార్థులకు టిసి ఇచ్చి పంపియలేదని పాఠశాల యజమాన్యం వివరణ ఇచ్చినట్లు చెప్పారు. వాటికి సంబంధించిన అప్లికేషన్స్ తనిఖీ చేశారు. మండల విద్యాధికారి ఆదేశాల మేరకు విద్యార్థులు, పాఠశాలలో చదువుకునే వారిని తిరిగి పాఠశాలలో చేర్పిచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మీ తెలిపారు. జె.ఎం.జె పాఠశాలలో టీసీలు తీసుకున్న విద్యార్ధులు తిరిగి పాఠశాలలో చేరవచ్చు అన్నారు.
పదవ తరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రతినెల జరిగే పీటీమ్ కు హాజరై పిల్లల ప్రగతి తీసుకోవాలని పేరెంట్స్ కి విజ్ఞప్తి చేశారు. పిల్లల హాజరు శాతము సరిగ్గలేకపోతే విద్యార్ధులు ఉత్తమ ప్రతిభ సాధిమలేరని, పదవతరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.



