Thursday, July 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వాపూర్ లో బోర్వేల్ రీచార్జ్ స్ట్రక్చర్ కు మార్కౌట్ వేసిన ఎంపీడీఓ

బస్వాపూర్ లో బోర్వేల్ రీచార్జ్ స్ట్రక్చర్ కు మార్కౌట్ వేసిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామస్తుల నీటి అవసరాల దృష్ట్యా ఆ గ్రామ సర్పంచ్ వినతి మేరకు గురువారం బోర్వేల్ రీచార్జ్ స్ట్రక్చర్ కు మార్కౌట్ వేశామని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్ల కోసం గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమస్యను పరిష్కరించేందుకు ఈ పనికి పూనుకున్నామని ఆయన పేర్కొన్నారు. దీంతో బస్వాపూర్ వాసులకు నీటి కష్టాలు ఉండబోవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బి అనిల్, ఎంపీఓ రాము, జీపీ కార్యదర్శి భరద్వాజ్, విబిజి రాంజీ మండల ఏపీఓ తులసిరాం, ఈసీ స్వామి దాసు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -