నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల, కామారెడ్డిలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్ ఆధ్వర్యంలో వింటర్ స్పెషల్ క్యాంప్ ప్రారంభ కార్యక్రమం ప్రిన్సిపల్ డా. సి. శోభారాణి ఆధ్వర్యంలో అధ్యాపకులు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సమక్షంలో విజయవంతంగా నిర్వహించబడింది. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్ బృందం దత్తత గ్రామమైన మార్కల్ గ్రామానికి వెళ్లి అక్కడి ప్రభుత్వ పాఠశాలలో గ్రామ సర్పంచ్ ప్రియాంక , గ్రామ కార్యదర్శి శ్రావంతి ,హెడ్‌మాస్టర్ కిరణ్ పాఠశాల సిబ్బంది సమక్షంలో మరో ప్రారంభ కార్యక్రమం నిర్వహించింది.
ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి. చంద్రకళమార్గదర్శకత్వంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను వివిధ గుంపులుగా విభజించి వారికి పనుల షెడ్యూల్ ప్రకారం బాధ్యతలు కేటాయించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాఠశాల మైదానం పాఠశాల పరిసరాలను శుభ్రపరిచారు. గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది.



